- Advertisement -
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. చక్రతాస్ శివారులో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతా బలగాల రాకను గమనించిన తీవ్రవాదులు కాల్పులు తెగపడ్డారు. దీంతో సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లష్కర్ తోయిబా కు చెందిన తౌఫిల్‌గా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 22 రాష్ట్రీయ రైఫిల్స్, 9 పారా కమాండోలు, ఎకె 47 రైఫిల్, పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని కశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. జనవరి నుంచి ఇప్పటి వరకు 28 మంది ఉగ్రవాదులు సైన్యం చేతిలో హతమయ్యారు.
- Advertisement -