Thursday, January 23, 2025

కుంజియులర్ లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Corona to 70 thousand men in the Armed Forces

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఐజి విజయ్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. లష్కరేతొయిబాకు చెందిన జాన్ మహ్మద్ లోన్‌గా గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ హత్య కేసులో జాన్ నిందితుడిగా ఉన్నాడు. మరో తీవ్రవాది గుర్తించాల్సిన అవసరం ఉందని, ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News