Monday, December 23, 2024

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి

- Advertisement -
- Advertisement -

Two terrorists attempting suicide attack at army camp

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. రాజౌరీకి 25 కిలీ మీటర్ల దూరంలో గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. భద్రతా అధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News