Monday, January 13, 2025

పాక్ గ్వాదర్‌లో ఎన్‌కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

గ్వాదర్ : పాకిస్థాన్‌లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతులు అయ్యారు. రేవుపట్టణం గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజనీర్లను తీసుకువెళ్లుతున్న కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరిపారు.ఈ దశలో భద్రతాబలగాలకు , ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చైనాకు చెందిన అత్యంత కీలకమైన ఎకనామిక్ కారిడార్ సిపిఇసికి ఈ రేవుపట్టణం వ్యూహాత్మక కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో సిపిఇసి పనుల వేగవంగానికి చైనా నుంచి అత్యధిక స్థాయిలో నిధులు గుప్పిస్తున్నారు. దీనిని ప్రతిఘటిస్తూ బలోచ్ లిబరేషన్ ఆర్మీ తరచూ దాడులకు దిగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్‌కౌంటర్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News