- Advertisement -
జమ్మూకశ్మీర్: ఈ నెల 1న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. దంగ్రీ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆదివారం ఉదయం ఆపరేషన్ కొనసాగుతుండగా బాలాకోట్ సరిహద్దు వద్ద ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.బీజీ సెక్టార్‌లోని బాలాకోట్‌లోని దేరీ దబ్సీ ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు భారత ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ట్విట్టర్‌లో పేర్కొంది.
- Advertisement -