- Advertisement -
జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో బుధవారం నియంత్రణ రేఖ వెంబడి చొచ్చుకుని రావడానికి విఫలయత్నం చేసిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కశ్మీర్‌లోని ఉరి నాలా వద్ద ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని ఆర్మీ వెల్లడించింది. ఈ సందర్భంగా రెండు వైపులా భారీగా కాల్పులు జరిగాయి. భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు, ఇతర నిల్వలను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఆర్మీ చీనార్ దళాలు ప్రకటించాయి. అనంతనాగ్ జిల్లా పహాల్‌గామ్‌లో ఉగ్రదాడి జరిగిన 24 గంటల్లోనే ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం.
- Advertisement -