- Advertisement -
జమ్ము : జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించే ఉగ్రవాదులు ఇద్దరిని ఆర్మీ హతమార్చింది. పూంచ్ సెక్టార్‌లో సోమవారం తెల్లవారు జామున నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను సైనిక బలగాలు గమనించాయి. పూంచ్ సెక్టార్‌లో ఆపరేషన్ బహదూర్‌ను ఆదివారం రాత్రి సైనికులు, పోలీస్‌లు సంయుక్తంగా చేపట్టి ఉగ్రవాదుల చొరబాటును భగ్నం చేశాయని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
- Advertisement -