Monday, December 23, 2024

కుల్గామ్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists killed in Kulgam

శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఇద్దరు లష్కరే తోయిబాకు చెందిన వారు. ఇందులో ఒకరు పాక్‌కు చెందిన ఉగ్రవాది ఉన్నాడని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల సంచారంపై పక్కాగా అందించిన సమాచారం మేరకు … ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్బంగా చెయాన్ దేవ్‌సర్ ప్రాంతంలో భద్రతా బలగాల పైకి ఉగ్రవాదులు కాల్పులు జరపగా వాటిని భద్రతా బలగాలు తిప్పికొట్టాయని , ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు పేర్కొన్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని పాకిస్థాన్ ఉగ్రవాది హైదర్‌గా గుర్తించినట్టు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ చెప్పారు. హైదర్ రెండేళ్లుగా ఉత్తర కశ్మీర్‌లో చురుకుగాఉన్నాడని, అనేక నేరాల్లో పాల్గొన్నట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News