Sunday, December 22, 2024

రెండు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two terrorists were killed in two encounters

శ్రీనగర్ : శ్రీనగర్ శివారు ప్రాంతం హార్వాన్ ఏరియాలో సోమవారం జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కర్ తొయిబాకు చెందిన టాప్ కమాండర్ సలీం పర్రే ఉన్నాడు. ఈ లష్కర్ తొయిబా టాప్ కమాండర్ భయంకరమైన ఉగ్రవాది అని, అయినా శ్రీనగర్ పోలీసులు అతడ్ని నిర్వీర్యం చేయగలిగారని కశ్మీర్ జోన్ ఐజిపి విజయ్‌కుమార్ చెప్పారు. ఆపరేషన్ వివరాలు తరువాత చెబుతామని ఆయన పేర్కొన్నారు. గాసు గ్రామం సమీపాన జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో గుర్తు తెలియని ఉగ్రవాది మరణించాడని చెప్పారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఇంకా కాల్పులు సాగుతున్నాయి. జమ్ము సెక్టార్‌లో భారీగా మందుగుండు సామగ్రి, హెరాయిన్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News