Friday, April 25, 2025

దొంగతనానికి వచ్చి.. కరెంట్ షాక్ తో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

దొంగతనం చేసేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు దొంగలు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో జరిగింది. స్థానికంగా ఉన్న ప్రగతి సోలార్ ప్లాంట్లో తరచూ కేబుల్ దొంగిలిస్తుండటంతో.. దీన్ని అరికట్టేందుకు రెండు విద్యుత్ షాక్ కంచెలు ఏర్పాటు చేశారు.

అయితే ఇది తెలియని దొంగలు కంచె దాటేందుకు ప్రయంత్నించడంతో కరంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News