Tuesday, March 25, 2025

పోలీసులమని చెప్పి.. రూ.5 లక్షలతో పరార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బోయిన్‌పల్లిలో ఓ యువకుడిని ఇద్దరు దొంగలు చాలా తెలివిగా మోసం చేశారు. ఎంఎంఆర్ గార్డెన్ వద్ద యువకుడిని ఇద్దరు వ్యక్తులు ఆపారు. పోలీసులుగా చెప్పుకొని ఆ యువకుడిని డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అడిగారు. తనిఖీలు చేస్తున్నట్లు నటించి బ్యాగ్‌ నుంచి రూ.5లక్షలు తీసుకున్నారు. లెక్కలు చూపని నగదు అంటూ రూ.5 లక్షలతో పరార్ అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News