- Advertisement -
ఆదిలాబాద్ న్యూస్: పెన్ గంగ కాలువలో రెండు పులులు ప్రాజెక్టు ఇంజనీర్లకు కనబడ్డాయి. వారు వెంటనే జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చుట్టూ పక్కల గ్రామస్థులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో చనాకా కొరాట ప్రాజెక్టు పంప్ హౌజ్ నిర్మించారు.
ఈ పంప్ హౌజ్ నుంచి ఎత్తి పోసి నీరు ఈ కాలువలో వదులుతారు. డెలివరీ సిస్టర్న్ కు దగ్గరలో కాలువలో ఈ రెండు పులులు సంచరిస్తూ కనిపించాయి. జైనత్ మండలం హత్తిఘాట్ గ్రామం వద్ద పంప్ నిర్మాణం జరుగుతుంది. పంప్ హౌజ్ నుంచి 20 కిలో మీటర్ల దిగువన చనకా కోరాట బ్యారేజీ ఇప్పటికే పూర్తి చేశారు. పక్కనే మహారాష్ట్రలో ఉన్న తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చూరీ నుంచి వచ్చి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు.
పెన్ గంగ కాలువలో రెండు పులులు pic.twitter.com/0ITGNI0Saa
— Mana Telangana (@ManaTelanganaIN) November 8, 2022
- Advertisement -