Monday, January 20, 2025

బెంగాల్‌లో మణిపూర్ తరహా ఘటన..మమత ఏం చేశారు: బిజెపి(వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో కొద్ది రోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి చిత్ర హింసలకు గురిచేశారని, తమ కళ్ల ముందే ఇంతటి దారుణం జరుగుతున్నప్పటికీ పోలీసులు మౌన ప్రేక్షక పాత్ర పోషించారని బిజెపి శనివారం ఆరోపించింది. ఈ దారుణ ఘటన జులై 19న మాల్డాలో జరిగిందని, ఇద్దరు గిరిజన మహిలలను వివస్త్రలను చేసిన మూకలు నగ్నంగా ఉన్న వారిని క్రూరంగా హింసించారని బిజెపి ఐటి విభాగం అధిపతి, పశ్చిమ బెంగాల్ బిజెపి ఇన్‌చార్జ్ అమిత్ మాల్వీయ శనివారం ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బ్లర్ చేసిన ఒక వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. మణిపూర్ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుపిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీపై ఆయన ఎదురుదాడి చేశారు. తన రాష్ట్రంలో ఇంత ఘోరం జరిగినప్పటికీ మమతా బెనర్జీ హృదయం ముక్కలు కాలేదని, బెంగాల్ హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న మమతా బెనర్జీ గగ్గోలు పెట్టేబదులు తగిన రర్యలు తీసుకోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.

మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు వివస్త్రలను చేసి నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో గత బుధవారం రాత్రి వెలుగుచూసిన దరిమిలా ఈ ఘటనపై ప్రతిపక్షాలు మణిపూర్‌లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. దీంతో బిజెపి కూడా బిజెపియేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరిగిన ఇదే తరహా ఘటనలను ప్రస్తావిస్తోంది. అందులో భాగమే బెంగాల్‌లో జరిగిందని చెబుతున్న ఈ ఘటన.

బెంగాల్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన దాడి సంఘటనపై మమతా బెనర్జీ మాట్లాడకపోవడాన్ని మాల్వీయ తప్పుపట్టారు. ఈ ఘటనను ఆమె ఖండించడం కాని, ఆవేదన వ్యక్తం చేయడం కాని చేయలేదని, అలా చేస్తే ముఖ్యమంత్రిగా తన వూఫల్యాన్ని ఒప్పుకున్నట్లు అవుతుందన్న కారణంతోనే ఆమె మౌనం వహిస్తున్నారని మాల్వీయ ఆరోపించారు.

బెంగాల్‌లో భయోత్పాతం కొనసాగుతోందని, మాల్డాలోని బంగన్‌గోలా పోలీసు స్టేషన్ పరిధిలోని పకువా మఠ్ ప్రాంతంలో ఇద్దరు గిరిజన మహిళలను మూకలు విస్త్రలను చేసి విచక్షణారహితంగా కొడుతూ హింసించారని మాల్వీయ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News