Sunday, November 17, 2024

తూర్పు ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులు

- Advertisement -
- Advertisement -

Two Ukrainian soldiers killed in attack on Lutsk airport

రెండువారాల యుద్ధంలో తొలిసారి దాడులు
లుస్క్ విమానాశ్రయంపై దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికుల మృతి
కీవ్ నగర శివార్లకు చేరువలో రష్యా వాహన శ్రేణి
వోల్నోవాఖా నగరం వేర్పాటువాదుల హస్తగతం

లెవివ్( ఉక్రెయిన్): ఇప్పటివరకు ఉక్రెయిన్ తూర్పు, దక్షిణ ప్రాంతాలపై క్షిపణి, బాంబుదాడులతో విరుచుకుపడుతూ వస్తున్న రష్యా తాజాగా శుక్రవారం పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలోని తమ సరిహద్దు సమీప విమానాశ్రయాలపై పెద్ద ఎత్త్తున దాడులకు దిగింది. మరో వైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేదిశగా దాదాపు 65 కిలోమీటరల మేర మోహరించిన రష్యా సైనిక బలగాలు గత కొద్ది రోజులుగా నిలచిపోయినప్పటికీ తాజాగా మళ్లీ ముందుకు కదులుతున్నట్లు తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతం కూడా సురరక్షితం కాదనే సందేశాన్ని ఇవ్వడం కోసమే రష్యా ఉక్రెయిన్‌లోని పశ్చిమప్రాంత విమానాశ్రయాలపై దాడులు చేపట్టినట్లు భావిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని లుస్క్, ఇవానోఫ్రాంకివిస్క్ నగరాలపై మిసైల్ దాడులు జరిగాయి. ఉక్రెయిన్ అధికారులు కూడా ఈ దాడులను ధ్రువీకరించారు.

లుస్క్ విమానాశ్రయంపై జరిపిన దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు చనిపోగా, మరో ఆరుగురు పౌరులు గాయపడినట్లు వోలిన్ ప్రాంత అధిపతి యూరీ పోహుల్యాకో తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు ప్రారంభమై మూడో వారానికి చేరుకున్నా ఊహించని రీతిలో ఉక్రెయిన్ దళాలనుంచి ప్రతిఘటన ఎదురవుతూ ఉండడం, అంతర్జాతీయ సమాజంలో దాదాపుగా ఒంటరిగా మారి పోవడంతో పాటుగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన తీవ్రమైన ఆర్థి అంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూ డడంతో క్రెమ్లిన్ పాలకుల్లో అసహనం పెరిగిపోతూ ఉంది. మరో వైపు తమ బలగాల్లో నైతిక స్థైర్యం రోజురోజుకు దిగజారి పోతూ ఉండడం కూడా రష్యాకు పెద్ద సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను వీలయినంత త్వరగా తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో దాడులను తీవ్రం చేసినట్లు భావిస్తున్నారు.

కాగా, వారం రోజుల క్రితమే దాదాపు 65 కిలోమీటర్ల మేర రష్యా సైనిక శకటాల కాన్వాయ్ కీవ్ నగర శివార్లకు చేరుకున్నట్లు ఉపగ్రహ చిత్రాలు బైటపెట్టినా ఆహారం, ఇంధన సరఫరాల కొరత కారణంగా అక్కడే ఆగిపోయాయని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ బలగాల్లో కదలిక వచ్చినట్లు మాక్సార్ టెక్నాలజీస్ విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ బలగాలు నగరం ఉత్తరం వైపున ఉన్న ఆంటనోవ్ విమానాశ్రయం సమీప పట్టణాల వద్దకు చేరుకున్నట్లు ఆ చిత్రాలు వెల్లడించాయి. హోవిట్జర్ శతఘ్నులు ఎక్కుపెట్టి ఉన్న కొన్ని వాహనాలు దగ్గర్లోని అడవుల్లోకి వెళ్లినట్లు కూడా ఆ చిత్రాలను బట్టి తెలుస్తోంది. కీవ్ నగరంపై దాడులు చేయడం కన్నా అన్ని వైపులనుంచి నగరాన్ని చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకోవడమే ఈ బలగాల ప్రధాన లక్షంగా కనిపిస్తోందని రక్షణ నిపుణులు అంటున్నారు. మరోవైపు రష్యా మద్దతు గల వేర్పాటువాదులు ఉక్రెయిన్‌లోని మేరియుపోల్ సమీప వోల్నో వాఖా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైనిక వర్గాలను ఉటంకిస్తూ స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. మేరియుపోల్‌కు ఉత్తరద్వారంగా ఉండే ఈ నగరం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News