Tuesday, December 24, 2024

నేపాల్‌లో ఇద్దరు భారతీయు యువకుల గల్లంతు

- Advertisement -
- Advertisement -

Two UP's missing after landslide in Nepal

కట్మాండు: నేపాల్‌లోని కపిల్‌వస్తు జిల్లాలో కొండ చరియలు విరిగిపడి వాగు పొంగడంతో ఇద్దరు భారత యువకులు కొట్టుకుపోయారు. ఒక బృందంలోని సభ్యులైన ఈ ఇద్దరు యువకుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. శివరాజ్ మున్సిపాలిటీ-1 ప్రాంతంలోని ఒక వాగును కాలినడకతో దాటడానికి ప్రయత్నించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ జిల్లాకు చెందిన నిఖిల్ కౌశల్(17), సూరజ్ సోని(18) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.

పియుతన్ జిల్లాలోని స్వర్గద్వారి ఆలయాన్ని సందర్శించిన భారతీయ యాత్రికుల బృందంలో వీరిద్దరూ ఉన్నారు. వీరితో పాటు మరో 16 మంది ప్రయాణిస్తున్న వాహనం వాగులో నిలిచిపోగా ఈ ఇద్దరు యువకులు వాహనం నుంచి దిగినట్లు పోలీసులు చెప్పారు. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News