Monday, January 20, 2025

అమెరికా నుంచి అమర్‌నాథ్‌కు ఇద్దరు అమెరికన్ల హరోం హర

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కాలిఫోర్నియా నుంచి తరలివచ్చిన ఇద్దరు అమెరికన్లు అమర్‌నాథ్ యాత్రకు వచ్చి శివుడిని దర్శించుకున్నారు. వీరిరువురు శివభక్తులు. దక్షిణ హిమాలయాల్లోని పవిత్ర గుహలో వెలిసిన మంచులింగాన్ని సందర్శించుకున్న తొలి విదేశీయులు వీరే అని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన ఈ ఇద్దరు అమర్‌నాథ్ యాత్రలో తమ అనుభవాల గురించి పారవశ్యంతో తెలియచేస్తున్న వీడియోను స్థానిక జిల్లా అధికార యంత్రాంగం వెలువరించింది.

తాము కాలిఫోర్నియాలోని ఓ దేవాలయంలో ఉంటామని, చాలా ఏళ్లుగా తమకు అమర్‌నాథ్ యాత్ర జరపాలని, శివుడిని సందర్శించుకోవాలనే కల ఉందని వీరు తెలిపారు. ఇక్కడ జరిగే హారతి ఇతరత్రా పూజాలను అప్పుడప్పుడు వీడియోల్లో చూస్తూ ఉంటామని , ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూజాదికాల్లో పాల్గొనడం తమకు చెప్పలేని అనుభూతినిని తెచ్చిపెట్టిందని వీరు తెలిపారు. కాషాయ దుస్తులు, పొడవాటి గడ్డంతో ఉన్న వీరు తాము స్వామి వివేకానంద శిష్యులమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News