Monday, December 23, 2024

ఇండోర్ లో ఘోర ప్రమాదం..8మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ జిల్లాలో బుధవారం అర్థరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ బొలెరో వాహనంలో తొమ్మిది మంది ప్రయాణిస్తున్న వారిలో 8 మంది చనిపోయారు. మరోకరు గాయడపడ్డారు. చనిపోయిన ఎనిమిది మందిలో ఒక పోలీసు కానిస్టేబుల్ ఉన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News