Sunday, December 22, 2024

జమ్మూలో ఉగ్రవాదుల ఘాతుకం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరొక మారు తెగబడ్డారు. కిష్త్‌వర్ జిల్లాలో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డు (విడిజి)లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం వారిని కాల్చి చంపారు. అధ్వారీలోని ముంజ్లా ధర్ అడవి ప్రాంతంలో నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్‌లను గురువారం కిడ్నాప్ చేసిన ఉగ్ర మూకలు వారిని కాల్చి చంపారు. ఆ ఇద్దరి మృతదేహాలను కెశ్వన్ ప్రాంతంలోని పొంద్‌గ్వారిలో ఒక వాగు సమీపంలో వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ మృతదేహాలను జిల్లాలోని వారి ఇళ్లకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హత్యలకు బాధ్యులైన ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు కిష్త్‌వర్‌లో పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి.

శ్రీనగర్ ఆదివారం సంతలో గ్రనేడ్ దాడిలో 12 మంది వ్యక్తులు గాయపడిన తరువాత తాజాగా ఈ ఘటన జరిగింది. విడిజిలను కిడ్నాప్ చేసి హత్య చేసింది తామేనని జైష్ ఎ మహమ్మద్ అనుబంధ సంస్థ కాశ్మీర్ టైగర్స్ ప్రకటించింది. కళ్లకు గంతలతో ఉన్న మృతదేహాల ఫోటోలను ఆ సంస్థ విడుదల చేసింది. ఆ ఘాతుకాన్ని జెకె లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పిడిపి, కాంగ్రెస్, బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News