Sunday, December 22, 2024

లంచం తీసుకున్న ఇద్దరు వీఆర్ఏల సస్పెండ్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి సిబ్బంది పై మరోసారి వేటు పడింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రెవిన్యూలో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై వేటు పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే చికోటితో బ్యాంకాంగ్ లో దొరికిన వీఆర్ఏతో పాటు భారీగా భూమాఫియా, అక్రమ నిర్మాణాలకు సహకరించిన రెవిన్యూ ఇన్స్పెక్టర్ ను జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అనంతరం ఆర్ డిఓ మల్లయ్య, ఎమ్మార్వో సంజీవ రావు నెత్రుత్వంలో గాజులరామారం లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ఈ అక్రమాల ఏరువేతలో భాగంగా మరో ఇద్దరు సిబ్బంది అక్రమ నిర్మాణాల విషయంలో ఫోన్ పే ద్వారా 50వేలు తీసుకున్నట్లు జిల్లా అధికారులకు పిర్యాదు అందడంతో దర్యాప్తు చేసిన రెవెన్యూ ఉన్నత అధికారులు ఇద్దరు సిబ్బంది పై వేటు వేసినట్లు తెలిపారు. ఇప్పటికి కుత్బుల్లాపూర్ రెవిన్యూ కార్యాలయంలో నెల రోజుల వ్యవధిలో 4సస్పెండ్ కు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News