Monday, January 20, 2025

రాబర్ట్ వాద్రా అరెస్టుపై రెండు వారాల స్టే

- Advertisement -
- Advertisement -

జోధ్‌పూర్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది. తన కస్టోడియల్ ఇంటరాగేషన్‌నుపై స్టే ఇవ్వాలని కోరుతూ వాద్రా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అయితే ఆయనను రెండు వారాలపాటు అరెస్టు చేయకూడదని మాత్రం హైకోర్టు ఆదేశించింది. వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్థాన్‌లోని బికనీర్‌లో కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన లావాదేవీలపై వాద్రాపై పోలీసు కేసు నమోదైంది. దీనిపై గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ భాటి తీర్పు వెలువరిస్తూ వాద్రా ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకవడానికి అనుమతిస్తూ ఆయన అరెస్టును రెండు వారాలపాటునిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News