మన తెలంగాణ/పర్వతగిరి: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. పర్వతగిరి సిఐ రాజగోపాల్ కథనం ప్రకారం.. సూర్యపేట జిల్లా మోతె మండలం అన్నారిగూడెం గ్రామానికి చెందిన మండవ సాయి, బోడబండ్ల గూడెం గ్రామానికి చెందిన కూరపాటి ఎల్లయ్యలు గత కొన్ని నెలులుగా జల్సాలకు అలవాటు పడి కూలీ పనిచేయగా వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో ఎలాగైనా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఎండు గంజాయి అమ్మాలని నిర్ణయించుకొని వారికి తెలిసిన ఒరిస్సాకు చెందిన దత్తు అనే వ్యక్తి నుంచి కిలో గంజాయి రూ. 10 వేలకు కొనుగోలు చేసి గంజాయి తాగే వ్యక్తులకు కిలో రూ. 25 వేల చొప్పున అమ్ముతున్నారు.
ఇదే మాదిరిగా గత రెండు రోజుల క్రితం దత్తు దగ్గర రెండు కిలోల గంజాయి కొని నెక్కొండ రైల్వే స్టేషన్‌లో అమ్ముదామని ఆ గంజాయిని కాలేజ్ బ్యాగులో పెట్టుకొని ఎపి24ఏఎక్స్7104 హోండా షైన్ బైక్‌పై వెళ్తున్న క్రమంలో అన్నారం గ్రామ శివారులోని ఇండియాన్ ఆయిల్ పెట్రోలు బంక్ వద్దకు చేరుకోగా అదే సమయంలో ఎస్సై ప్రవీణ్ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా వారిని పట్టుకున్నారు. వీరి నుంచి 2.65 కిలోల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, షైన్ బైక్ సీజ్‌చేసి కేసు నమోదుచేసిన అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.