Monday, December 23, 2024

లైంగిక వేధింపులు… గాజుల రామారం సర్కిల్ లో ఇద్దరు సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పారిశుధ్య కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించి ఇద్దరు ఉద్యోగులను జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జిహెచ్ఎంసి పరిధిలోని గాజుల రామారం సర్కిల్ పరిధిలో ఎస్ఎఫ్ఎ కిషన్ విధి నిర్వహణలో ఓ పారిశుధ్య కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు గురువారం మన తెలంగాణ పత్రికలో ప్రచురితమైంది. ఈ ఘటనపై స్పందించిన గాజులరామారం డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి వెంటనే దర్యాప్తుకు ఆదేశించటం జరిగింది. ఈ వేధింపుల అంశంపై దర్యాప్తు చేసిన ఎఎంహెచ్ఒ చంద్ర శేఖర్ రెడ్డి సమగ్ర నివేదిక ను సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు అందజేశారు. ఈ ఘటనకు కారకులు అయిన ఎస్ఎఫ్ఎ కిషన్ తో పాటు పారిశుధ్య కార్మికుడు ప్రణయ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ చేసినట్లు గుర్తించారు. జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు విధుల నుంచి వారిని తొలగించినట్టు ప్రకటించటం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News