Wednesday, January 22, 2025

బాల్ విసిరాడు… క్యాచ్ పట్టాడు కానీ రెండు వికెట్లు…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌లో భాగంగా చిదంబరం స్టేడియంలో చెన్నైసూపర్ కింగ్స్ (200) భారీస్కోర్ చేసినప్పటికి పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. పంజాబ్ ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడడంతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా తన బౌలింగ్‌లో తానే క్యాచ్ పట్టి ఎండ్‌లో రనౌట్ చేశాడు. దీంతో ఒకే బంతితో ఇద్దరిని ఔట్ చేశాడు. కానీ ఒకరు మాత్రమే మైదానం వీడారు. 11 ఓవర్‌లో రెండో బంతిని తైడే పైకి లేపడంతో బౌలింగ్ చేసిన రవీంద్ర జడేజా ఒడిసి పట్టుకున్నాడు. మరో ఎండ్‌లో లివింగ్ స్టోన్ క్రీజు వదిలి బయటకు రావడంతో బెయిల్స్ ను జడేజా కింద పడేశాడు. అప్పటికే అతడు క్యాచ్ పట్టడంతో తైడే ఔట్ కావాల్సి వచ్చింది. క్యాచ్ పట్టినది మాత్రమే అతడి ఖాతాలోకి చేరింది.

Also Read: అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News