Thursday, January 23, 2025

జయశంకర్ భూపాలపల్లిలో విషాదం

- Advertisement -
- Advertisement -

చిట్యాల : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చిట్యాల మండలం కైలాపూర్ లో మంగళవారం మిరపనారు నాటుతుండగా పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. తెలంగాణవ్యాప్తంగా గత మూడ్రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అటు వర్షాలు జోరందుకోవడంతో రైతుల పోలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మహిళల మరణ విన్న గ్రామస్తులు కన్నీరుమన్నీరవుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News