Sunday, December 22, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

మునగాల : సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామశివారు 65వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం ట్రాక్టర్‌ను లారీ ఢికొట్టిన ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలకు గురైన ఇద్దరు మహిళలను ఖమ్మం హాస్పటల్‌కు తరలిస్తుండగా మార్గ మద్యంలో ఒకరు మృతిచెందారు. మరోకరు చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న చెట్ల మొక్కలకు పాదులు తీసేందుకు జీఎంఆర్ సంస్థలో కూలీలుగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల

పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన నేలమర్రి వినోద, చెవుల ధనమ్మ, రోశమ్మను జీఎంఆర్ సంస్థగా గుర్తించిన ట్రాక్టర్‌లో వెళ్లి పనిచేస్తుండగా ఆగి ఉన్న ట్రాక్టర్‌ను హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు అజాగ్రత్తతో అతివేగంతో వచ్చి లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టిడంతో ప్రమాదంలో వినోద (30) అక్కడిక్కడే మృతిచెందగా ధనమ్మ మార్గం మధ్యలో మృతిచెందింది. హాస్పటల్‌లో చికిత్స పొందుతున్న రోశమ్మ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మృతురాలు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ పేర్కొన్నారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ రాజేంద్రప్రసాద్
జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు పై ప్రమాదాల నివారణ తగ్గించేందుకు ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలన్నారు. ఆకుపాములో జరిగిన ప్రమాద సంఘటనా స్థలాన్ని ఆయన క్లుప్తంగా పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్సెక్టర్ డి. ఆంజనేయులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News