Monday, December 23, 2024

పిడుగుపాటుతో ఇద్దరు కూలీల మృతి

- Advertisement -
- Advertisement -

చిట్యాలః పిడుగుపాటుతో ఇద్దరు మహిళ కూలీలు మృతిచెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కైలాపూర్ గ్రామ శివారు శాంతినగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన చిలువేరు సరిత(40), నేర్పాటి మమత(30) మరి కొంత మంది కూలీలు కలిసి గ్రామానికి చెందిన ఓ రైతుకు మిరప నారు నాటేందుకు కూలి పనులకు వెళ్లినట్లు చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షం పడడంతో కూలీలంతా సమీపంలోని చెట్టు క్రిందికి వెళ్లినట్లు తెలిపారు.

ఒకేసారిగా పిడుగు పడడంతో చిలువేరు సరిత, నేర్పాటి మమతలు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనలో పర్లపల్లి భద్రమ్మ, ఆరేపల్లి కొమురమ్మ, మైదం ఉమ, శివలు తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో మండల కేంద్రంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజిఎంకు తరలించినట్లు తెలిపారు. ఒకే కాలనీకి చెందిన ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News