Saturday, April 5, 2025

ఎదురు కాల్పులు.. ఇద్దరు మహిళా మావోలు హతం

- Advertisement -
- Advertisement -

కొందమాల్ జిల్లా మటకుప రిజర్వ్ ఫారెస్ట్ జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తాడికొల గ్రామ సమీపాన కూంబింగ్ చేస్తున్న బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరపడంతోపాటు, గ్రనేడ్లతో దాడి చేశారు. దీంతో బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందగా, మరికొందరు తప్పించుకున్నారు. ఈమేరకు ఐజీ అమితాబ్ ఠాకూర్ వివరాలు వెల్లడించారు. మృతుల్లో ఒకరిని ఎసిఎమ్ ర్యాంక్ కమలగా గుర్తించామని, మరొకరి వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ అమితాబ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News