Monday, December 23, 2024

మణిపూర్‌లో దారుణం

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : ఘర్షణల మణిపూర్‌కు సంబంధించి ఇప్పుడు వెలువడ్డ భయానక వీడియో సంచలనం కల్గించింది. కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తూ గుంపుగా తీసుకెళ్లిన ఘటన వీడియో సామాజిక మాధ్యమాలల్లో వెలువడింది. కంగ్పోక్పి ప్రాంతంలో ఈ మహిళలను ఆ తరువాత పొలాల్లోకి తీసుకువెళ్లి దారుణంగా అత్యాచారం జరిపారని గిరిజన సంఘం ఐటిఎల్‌ఎఫ్ నేతలు తెలిపారు. ఇది గర్హనీయం అని, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణల ఉధృతి సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

రాష్ట్రంలోని కుకీలు, మైతీ తెగల మధ్య ఎస్‌టి హోదాపై ఘర్షణలు జరుగుతున్నాయి. తమ కుకీ జో గిరిజన తెగకు చెందిన ఇద్దరు మహిళలపై దారుణం జరిగిందని కుకీలకు ప్రాతినిధ్యం వహించే ఐటిఎల్‌ఎఫ్ తెలిపింది. మైతీ గిరిజనుల అరాచక మూక ఈ దారుణానికి పాల్పడిందని, తమను పాడుచేయవద్దని మహిళలు ఎంత వేడుకున్నా వినలేదని , వారి కబంధ హస్తాలలో వీరి బతుకులు బలి అయ్యానని ఓ ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News