Tuesday, September 17, 2024

కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరులోని రియాసీ జిల్లాలో వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే కొత్త మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడి ఇద్దరు మహిళా యాత్రికులు మరణించగా ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. మధ్యాహ్నం 2.35 ప్రాంతంలో ఆలయానికి మూడు ఇకల్లామీటర్ల దూరంలోని పంచి సమీపంలో ఈ ఘటన జరిగిందినట్లు దికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓవర్‌హెడ్ ఇనుప కట్టడంలో ఒక భాగం కూడా దెబ్బతిందని వారు చెప్పారు. ఆలయానికి వెళుతుండగా మార్గంలో కొండచరియ విరిగిపడడంతో ఈ యాత్రికులు ఇనుప కట్టడం కింద చిక్కుకుపోయారని వారు చెప్పారు.

ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా ఒక బాలిక తీవ్రంగా గాయపడిందని రియాసీ డిప్యుటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ తెలిపారు. సీనియర్ పోలీసులు, జిల్లా అధికారులు ఘటనా స్థలికి హుటాహుటిన తరలివెళ్లారని, పూర్తి వివరాలు తెలియరావలసి ఉందని ఆయన చెప్పారు. త్రికూట పర్వతాలపై వెలసిన వైష్ణోదేవి ఆలయానికి బేస్ క్యాంపుగా ఉన్న కాట్రాకు మహాజన్ బయల్దేరి వెళ్లారు. 2022లో నూనత సంవత్సరం నాడు వైష్ణోదేవి ఆలయంలో తొక్కిలాట చోటుచేసుకుని 12 మంది భక్తులు మరణించగా 16 మంది గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News