Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా టెక్కీల మృతి

- Advertisement -
- Advertisement -

Two women techies died in Chennai road accident

చెన్నై: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో హెచ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ఘటన చెన్నైలోని ఐటీ కారిడార్‌లోని నవలూరులో చోటుచేసుకుంది. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు చెందిన ఎస్ లావణ్య, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఆర్ లక్ష్మి, వారిద్దరూ 23 ఏళ్లుగా గుర్తించారు. నిందితుడు మోతీష్ కుమార్ (20) బుధవారం రాత్రి 11:30 గంటలకు కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా తన హోండా సిటీ కారు అదుపు తప్పి రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టాడు. దీంతో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, లావణ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News