Monday, December 23, 2024

ఔటర్‌పై కూలీలను ఢీ కొట్టిన డిసిఎం..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

కీసరః కీసర వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొక్కలు నాటుతున్న మహిళా కూలీలను డిసిఎం ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందారు. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని యాద్గార్‌పల్లి గ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై డివైడర్ మద్యలో గురువారం సాయంత్రం 20 మంది మహిళా కూలీలు మొక్కలు నాటుతున్నారు. ఆ సమయంలో శామీర్‌పేట వైపు నుండి వేగంగా వచ్చిన డిసిఎం (టిఎస్ 05 యుఎఫ్ 3876) వాహనం పనిలో ఉన్న కూలీలపైకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో నల్గొండ జిల్లా మోత్కురు మండలం చందుపట్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మ (42), రాములబండ గ్రామానికి చెందిన లింగమ్మ (45)

తీవ్ర గాయాలతో అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు ప్రమాదానికి కారణమైన డిసిఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కూలీల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా కూలీలను డిసిఎం ఢీ కొట్టిన ప్రమాద సమయంలో రింగ్ రోడ్డుపై అటు వైపుగా వచ్చిన టాటా జిప్ ట్రక్కును (టిఎస్ 08 యుజి 7645) డ్రైవర్ నిర్లక్షంగా నడపంతో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News