Sunday, December 22, 2024

పండగపూట విషాదం.. కరెంట్ షాక్ కొట్టి రెండేళ్ల బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

కరెంట్ షాక్ కొట్టి రెండు సంవత్సరాల బాలుడు మృతి చెందిన విషాదసంఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. తూటికుంట్ల గ్రామానికి చెందిన రమేష్ 2 సంవత్సరాల కుమారుడు ఆడుకుంటూ.. కుట్టు మిషన్‌కు ఏర్పాటు చేసిన కరెంట్ మోటారు వైర్‌ను నోట్లో పెట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News