Monday, January 20, 2025

హకీంపేట స్పోర్ట్ స్కూల్‌లో బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

ప్రమాదవశాత్తు గుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన హకీంపేట స్పోర్ట్ స్కూల్ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి హకీంపేట స్పోర్ట్ పాఠశాల ప్రాంగణంలో ఉన్న నర్సరీలో పని చేస్తున్నారు. వారి కుమారుడు కాన(2) ఆడుకుంటూ వెళ్లి నీటి గుంతలో పడిపోయాడు. ఇది ఎవరూ గమనించకపోవడంతో బాలుడు అందులోనే మృతిచెందాడు. కొద్ది సేపటికి బాలుడు కన్పించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు, తర్వాత గుంత వద్దకు వచ్చి చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News