Saturday, December 28, 2024

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ చిన్నారి తల్లిదండ్రులు ప్రమాదంలో జీవన్మృతురాలైన (బ్రెయిన్‌డెడ్ ) తమ రెండేళ్ల కుమార్తె శరీరం లోని అవయవాలను దానం చేసి ఇద్దరు పిల్లలకు పునర్జన్మనిచ్చారు. రెండేళ్ల దివ్యాన్షి మూడంతస్తుల భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడింది. చికిత్స కోసం ఎయిమ్స్‌కు తరలించగా ఆమె బ్రెయిన్‌డెడ్‌కు గురైందని, బాలిక శరీరం లోని అవయవాలు సక్రమంగా పని చేస్తున్నందున వాటిని అవసరాల్లో ఉన్న వారికి దానం చేయాల్సిందిగా డాక్టర్లు ఆ చిన్నారి తల్లిదండ్రులను కోరారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించడంతో బాలిక గుండెను చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 8 నెలల పాపకు అమర్చారు. రెండు కిడ్నీలను ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మరో 17 ఏళ్ల బాలికకు అమర్చారు. కళ్లను ఐ బ్యాంక్‌లో భద్రపరిచారు. ఢిల్లీలో అతిచిన్న వయసులో అవయవదానం చేసిన బాలికగా దివ్యాన్షి రికార్డుకెక్కింది.

48 ఏళ్ల మహిళ కిడ్నీలు కూడా …
ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో మరో అవయవదానం జరిగింది. ఈనెల 16న నోయిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శశి అనే మహిళ తలకు తీవ్ర గాయమై ఈనెల 17న బ్రెయిన్‌డెడ్ అయింది. దీంతో కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆ మహిళ రెండు కిడ్నీల్లోని ఒకటి ఎయిమ్స్ లోని ఓ రోగికి, మరోకటి ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో రోగికి డాక్టర్లు అమర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News