Wednesday, January 22, 2025

వ్యూస్ పెంచుకునేందుకు అడ్డదారిలో రీల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇన్‌స్టా రీల్స్‌లో వ్యూస్ పెంచుకునేంపదకు అడ్డదారిని అనుసరించిన ఇద్దరు యువకులను ఫిలింనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…దేవరకొండ సమీపంలోని చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన హనుమాన్ నాయక్(22) నగరంలోని రాయదుర్గం సమీపంలో నివాసం ఉంటూ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఘట్‌కేసర్‌కు చెందిన సిద్దూ (25) అనే యువకుడితో కలిసి గత కొంతకాలంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నాడు. వీరి రీల్స్‌కు ఎక్కువగా వ్యూస్ రావడంలేదు, దీంతో ఎక్కువ వ్యూస్ రావాలంటే వెరైటీగా వీడియో చేయాలని ప్లాన్ వేశారు. దీంతో ఇద్దరు కలిసి షేక్‌పేట రోడ్డుపై ఉన్న డీమార్ట్ స్టోర్‌కు వెళ్లారు.

అక్కడ చాక్లెట్లను తీసుకున్న హనుమాన్ నాయక్ వాటిని తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. అక్కడే ఓ షర్ట్ తీసుకుని ట్రయల్ రూమ్‌లోకి వెళ్లి ఫ్రీగా చాక్లెట్ ఇలా తినాలని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు రీల్స్‌లో వైరల్ కావడంతో డీ మార్ట్ యాజమాన్యం ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇతర కస్టమర్లను ప్రభావితం చేయడంతో పాటు తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తూ చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు రీల్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News