Wednesday, January 22, 2025

గొంతు కోసుకుని ఇద్దరు యువతుల ఆత్మహత్య యత్నం

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల : ఇద్దరు అమ్మాయిలే ప్రేమించుకున్నారు, పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. కొద్ది రోజులుగా కలిసి ఒకే గదిలో ఉంటున్నారు. ఏమైందో ఏమో అనుమానస్పద స్థితిలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలైన ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది . వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అంజలి, మహేశ్వరి అనే యువతులు ఇద్దరు బంధువులు. వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్ళి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో మహేశ్వరి ట్రాన్స్‌జెండర్. పెళ్ళి చేసుకోవాలనుకున్న వీరు కొద్ది రోజులుగా ప్రత్యేకంగా కలిసి ఉంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో ఒక రూము అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. కాగా ఏమైందో తెలియదు కానీ వీరిద్దరు రామకృష్ణాపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో అపస్మారక స్థితిలో కనిపించారు. తీవ్రగాయాలతో ఉన్న అంజలి, మహేశ్వరిని స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో అంజలి మృతి చెందగా, మహేశ్వరి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News