Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి..

- Advertisement -
- Advertisement -

టేకుమట్ల: కారును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంగా ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సం ఘటన కరీంనగర్‌జిల్లా శంకరపట్నం మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… టేపకారం మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన బొల్లికొండ ఆకాష్, రాకేష్, ఏంపేడు గ్రామానికి చెందిన మాడగోని శ్రావణ్‌లు కరీంనగర్‌కు అవసర నిమిత్తం కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపునకు వెళ్తున్న లారీ ఈ ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న శ్రావణ్, ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రాకేష్‌కు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుల మృతితో ఎంపేడు, పెద్దంపల్లి గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News