Sunday, December 22, 2024

రైలు వంతెనపై సెల్ఫీ..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హరిద్వార్ : ఉత్తరాఖండ్ హరిద్వార్ జిల్లాలో ఇద్దరు యువకులు శనివారం సాయంత్రం రైల్వే వంతెనపై నిలబడి సెల్ఫీ దిగుతుండగా, రైలు ఢీకొనడంతో మృతి చెందారు. మృతులు రూర్కీ పట్టణవాసులు సిద్దార్ధ్ సైనీ (19), శివం సైనీ (16)గా పోలీస్‌లు గుర్తించారు. వీరు తమ కుటుంబాలతో కలిసి లక్సర్ ప్రాంతం లోని సోలానీ నదీ తీరం వద్ద పూజల కోసం వచ్చారు. అక్కడికి సమీపాన గల దోస్నీ రైల్వే వంతెన వద్దకు వచ్చి సెల్ఫీలు దిగుతుండగా రైలు ఢీకొంది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News