Monday, December 23, 2024

కాపాడుదామని పోతే ప్రాణం పోయింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలా సమీపంలో జడ్చర్ల- కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని కల్వకుర్తికి చెందిన నవాజ్(25), కొత్తకోట మండలం కన్వేట గ్రామానికి చెందిన అశోక్(30) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..కల్వకుర్తికి చెందిన నవాజ్ అనే యువకుడు జడ్చర్ల నుండి కల్వకుర్తి బయలుదేరాడు. మార్గం మధ్యలో మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి .

రోదిస్తున్న నవాజ్ ను చూసి మిర్యాలగూడ నుండి కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామానికీ చెందిన బోలోరో వాహనంలో వెళుతున్న అశోక్ నవాజ్ కు సహాయం చేద్దామని దగ్గరికి వెళ్ళగానే మరో గుర్తు తెలియని వాహనం ఇద్దరిని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News