Monday, December 23, 2024

నిర్మాణ సంస్థలో ప్రమాదం..ఇద్దరు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓ నిర్మాణ సంస్థలో ఉన్న రెడీ మిక్సర్‌ను క్లీన్ చేస్తుండగా ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పుప్పాలగూడలోని ఎఎస్‌బిఎల్ నిర్మాణ సంస్థలో జార్ఖండ్ రాష్ట్రం, పాకూర్ జిల్లా, కిస్టోనగర్ గ్రామానికి చెందిన ఉన్న రెడీ మిక్సర్‌ను మరంగ్‌బేటా సోరెన్(30), సుశీల్ ముర్మ(29) రెండు నెలల క్రితం పని కోసం నగరానికి వచ్చి పుప్పాలగూడలోని లేబర్ క్యాంప్‌లో ఉంటూ ఎఎస్‌బిఎల్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు, ఈ క్రమంలోనే రెడీమిక్స్ మిషన్‌ను క్లీన్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే ఒక్కసారిగా మిక్సర్‌ను ఆన్ చేయడంతో మిక్సర్‌ను క్లీన్ చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. నిర్మాణ సంస్థ నిర్లక్షం వల్లే ఇద్దరు యువకులు మృతిచెందారని మృతుల బంధువులు సంస్థల కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఉద్రిక్తతతకు దారితీయడంతో నిర్మాణ సంస్థ యాజమాన్యం మృతదేహాలను వెంటనే అక్కడి నుంచి పోస్టుమార్టం కోసం తరలించింది. నార్సింగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News