Saturday, December 21, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దవూర: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని స్పిన్నింగ్ మిల్ దగ్గర చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం నిడమనూరు మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన బానావత్ వరుణ్(17)అదే గ్రామానికి చెందిన ఇంద్రకంటి సుమంత్‌తో కలిసి స్కూటీపై హైద్రాబాద్ వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్న క్రమంలో పెద్దవూర మండల పరిధిలోని స్పిన్నింగ్ మిల్ రాగానే నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న

బోల్లెరో వాహనం నెంబర్ ఎపి39యుఎప్2745 వాహనం డ్రైవర్ స్కూటిని ఎదురుగా ఢికోట్టడంతో బైక్ వెనుక కూర్చున్న వరుణ్ అక్కడిక్కడే మృతి చెందగా మరోకరిని చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమాలానెహ్రూ హస్పిటల్ తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందాడు.మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దవూర ఎస్‌ఐ పచ్చిపాల పరమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News