Saturday, March 1, 2025

అమ్మవారి దర్శనానికి వచ్చి మంజీర నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా, కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి శివారులో గల ఏడుపాయల మంజీరా నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఇందిరానగర్ కాలనీ, ఆసిఫ్ నగర్‌కు చెందిన నిన్నేకర్ కృష్ణ (18), మిల్కీకర్ శ్యాం కుమార్ (21) తమ కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల క్రితం ఏడుపాయల జాతరకు వచ్చారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఏడుపాయల ఆలయ సమీపంలోని పోతన జెడ్పల్లి శివారులోని మంజీర నది రెండవ బ్రిడ్జి వద్ద ఎడమవైపు నాగల మంజీరా నదిలో స్నానానికి వెళ్లి, ఈత కొడుతుండగా ఊపిరిరాడక సహాయం కోసం అర్థించారు.

సంఘటన స్థలంలో ఉన్న నిన్నేకర్ కృష్ణ అన్న అంబదాస్ నీటిలోకి వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే వారిద్దరూ మునిగిపోయారు. ఈ విషయం గజ ఈతగాళ్లకు తెలపగా గాలించి ఒడ్డుకు తీసుకొని వచ్చి చూడగా అప్పటికే ఆ ఇద్దరూ మరణించారు. కృష్ణ తల్లిదండ్రులు గోపాల్, శాంతమ్మకు ముగ్గురు కుమారులు ఉండగా రెండవవాడు కృష్ణ ప్రమాదవశాత్తు మరణించాడు. అలాగే శ్యాం కుమార్ తల్లిదండ్రులు రాజు, సావిత్రికి ఇద్దరు కుమారులు ఉండగా పెద్దవాడు ప్రమాదంలో పరణించడంతో రెండు కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒకరైన కృష్ణ తండ్రి నిన్నేకర్ గోపాల్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News