Thursday, January 23, 2025

కుక్కను ఉరేసి చంపిన యువకులు

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఇద్దరు యువకులు కుక్కను ఉరేసి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో జరిగింది. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ట్రోనికా సిటీలో ఇలాచిపూర్ గ్రామంలో మూడు నెలల క్రితం ఇద్దరు యువకులు కుక్క మెడకు తాడు కట్టారు. ఇద్దరు తాడును బలవంతంగా లాగడంతో శునకం చనిపోయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కుక్క గ్రామస్థులను కరుస్తుండడంతో యువకులు చంపారని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News