Wednesday, January 22, 2025

చెరువులో పడి ఇద్దరు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

బీర్కూర్ : కామారెడ్డి జిల్లా, బీర్కూర్ మండలం, తిమ్మాపూర్‌లో ఆడుతూ పాడుతూ సరదాగా వెళ్లిన ఇద్దరు యువకులు ఒకరిని కాపాడబోయి, మరొకరు మృతి చెందిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువులో దిగిన ఒక మిత్రుడు చెరువులో మునిగిపోతుండగా, అతనిని కాపాడబోయి చెరువులో మునిగిపోయాడు. తిమ్మాపూర్ శివారులోని అంకుస్ గని చెరువులో చోటుచేసుకుంది. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బాలేష్ (18) గణేష్ (16) కలిసి సోమవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై చెరువు కట్ట వద్దకు వెళ్లారు.

గణేష్ చెరువులో దిగగా, ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. గణేష్‌ను రక్షించే క్రమంలో బాలేష్ ప్రయత్నించి అతను కూడా చెరువులో మునిగిపోయాడు. గల్లంతైన యువకుల కోసం సోమవారం సాయంత్రం వరకు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం రాత్రి ఒక మృతదేహం దొరకగా, మంగళవారం మరొక మృతదేహం దొరికింది. దీంతో రెండు కుటుంబాల సభ్యులు, బంధువుల రోదనలు చెరువు కట్ట వద్ద అందర్నీ కలిచి శాయి. గణేష్ బీర్కూర్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. బాలేష్ బీర్కూర్‌లో మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News