Thursday, January 23, 2025

వీరపూర్ కేనాల్లో పడి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

బెజ్జంకి: మండలంలోని వీరపూర్ గ్రామ శివారులోని తోటపల్లి కెనాల్ వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మండలంలోని వీరపూర్‌లో చోటుచేసుకుంది. సిఐ ప్రవీణ్ రాజ్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని వీరపూర్ గ్రామానికి చెందిన చీలుమూల పవన్ (22) అతని స్నేహితుడు సికింద్రాబాద్‌కు చెందిన దావా రోహిత్ (16) కలసి శుక్రవారం వీరపూర్ గ్రామ శివారులో తోటపల్లి చెరువు కెనాల్ వద్ద చేతులు కడుకుందామని కెనాల్ లోకి దిగడంతో ప్రమాద శాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయాడు. ప్రమాదంలో ఉన్న స్నేహితుడిని కాపాడే క్రమంలో వీరపూర్ గ్రామానికి చెందిన పవన్ కు ఈత రాకపోవడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారని మృతుడు పవన్ తల్లి చీలుమూల లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సిఐ ప్రవీణ్ రాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News