Monday, January 27, 2025

విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా, కొల్చారం మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు యువకులు మృతి చెందారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన భాగ్య, యాదగిరి చిన్న కుమారుడు నవీన్ (24) చిన్న వెంకటేశం, సుజాత చిన్న కుమారుడు ప్రశాంత్ (25) బోరు వద్దకు వెళ్లే క్రమంలో 133 కెవి లైన్ నుంచి ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News