Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: వరంగల్‌లోని హంటర్ రోడ్డులో విశాల్ మార్ట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 33వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్ తోటకు చెందిన కొలిపాక శ్రీకాంత్, గాయత్రి కాలనీకి చెందిన బొంతు అఖిల్ తీవ్రంగా గాయపడి ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వెంటనే మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. హుటాహుటిన ఎమ్మెల్యే స్వయంగా ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతుండగానే శ్రీకాంత్, అఖిల్ మృతిచెందారు. ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, అన్ని విధాలుగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందచేశారు. ఎమ్మెల్యే డాక్టర్లతో చేయించిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్రగాయాలు కావడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఎమ్మెల్యే నరేందర్‌ను విచారానికి గురిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News