Wednesday, January 22, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

ఆమనగల్లు : టిప్పర్, ద్విచక్ర వాహనం ఢీకోని ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన సంఘటన ఆమనగల్లు మండలం మేడిగడ్డ శివారులోని కల్వకుర్తి రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానిక ఏసై బలరాం వివరాల ప్రకారం ఆమనగల్లు పట్టణంలోని గుర్రంగుట్ట కాలనీకి చెందిన బుడగ జంగాలు గుగ్గిల్ల చరణ్(35), శేఖర్ (25)లు చరణ్ భార్య బుజ్జి శుక్రవారం ఉదయం ఇంట్లో అలిగి తల్లిగారి ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు వెళ్లింది. చరణ్ తన భార్యను తీసుకురావడానికి ఆమనగల్లు పట్టణం నుంచి చరణ్, తమ్ముడు శేఖర్‌తో కలిసి ద్విచక్ర వాహానంపై అచ్చంపేటకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆమనగల్లు మండలం మేడిగడ్డ శివారులోని శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై వెళ్తుండగా

నుంచి డస్ట్ లోడ్‌తో హైదరాబాద్ వైపు వెళ్తున్న టిప్పర్ ఆమనగల్లు నుంచి అచ్చంపేట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం వేగంగా ఢీకోనడంతో సంఘటనా స్థలంలోనే చరణ్, శేఖర్‌లు మృతిచెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై బలరాం తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బల్‌రాజ్ హైదరాబాద్ వెళ్తున్నారు. కోద్దిసేపు ఆగి ప్రమాదానికి గల కారణాలను ఎఎసై బాల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమీషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రిలోని మృతదేహాలను సందర్శించి నివాళుర్పించి, యువకుల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News