Saturday, December 21, 2024

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: అతివేగంతో ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు వాహనదారులు. అతివేగం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించనప్పటికి అవేమీ పట్టించుకోకుండా మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నగరంలోని కుషాయిగూడ, ఏఎస్‌ రావ్‌ నగర్‌లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఆదివారం ఉదయం కుషాయిగూడలో వేగంగా బైక్‌పై దూసుకొచ్చిన యువకులు డివైడర్‌ను ఢీకొట్టారు.

దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఇదే తరహా ప్రమాదం ఏఎస్‌ రావు నగర్‌లో కూడా చోటుచేసుకున్నది. కేటీఎం బైక్‌పై అతివేగంగా వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలవండంతో ఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ రెండు ఘటనపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ సిబ్బంది వాహనదారులకు సూచిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News