- Advertisement -
భద్రాచలం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మనిగి చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్, వికారాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు వారి కుటుంబాలతో శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వచ్చారు. పుణ్య స్నానాలు ఆచరించేందుకు గోదావరిలో దిగినవారు నది లోతు అంచనా తెలియక సుమారు 4.20 గంటల సమయంలో స్నానఘట్టాలకు సమీపంలోని గోదావరి నది ప్రవాహంలో గల్లంతయ్యారు. అప్రమత్తమైన గజ ఈతగాళ్ల బృందం నదిలో గాలించి వారిని ఒడ్డుకు చేర్చగా అప్పటికే వారు మృతి చెందారు. మృతులు పవన్ (20), హరిప్రసాద్ (18)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -